అమరావతిలో మరో 10 ఐటీ కంపెనీలు ప్రారంభం

  • ఐటీ కంపెనీలను ప్రారంభించిన నారా లోకేష్
  • చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా ముఖ్యమన్న మంత్రి
  • అన్ని వసతులు కల్పిస్తున్నామన్న లోకేష్
ఏపీలో ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. ఈరోజు అమరావతిలో 10 ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఐటీ కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తోందని చెప్పారు. రాయితీలను సకాలంలో ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలను రూపొందించామని చెప్పారు. ఐటీ రంగానికి అవసరమయ్యే విధంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. 
Go Back to Shorts
amaravathi
nara lokesh
it
companies

More Telugu News